
himalayan glaciers melting, గ్లేసియర్స్ పూర్తిగా కరిగిపోయినా గంగా నది ఎండిపోదు: తాజా అధ్యయనం – himalayan glaciers melting doesn’t mean ganga will dry up says study
[ad_1]
‘హిమానీనదం కరిగిపోవడం నదుల ప్రవాహంపై ఏ మాత్రం ప్రభావితం కాదు.. నదులు ఎండిపోవడం ఉండదు’ తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. అయితే, గతంలో పలు అధ్యయనాలు హిమానీ నదాలు కరుగుతున్నట్టు సూచించాయి. చివరి మంచు యుగ్గం 11,700 ఏళ్ల కిందట ముగిసినప్పటి నుంచి హిమానీనదాలు కరిగి.. వెనక్కి తగ్గుతున్నాయి.. కానీ, ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ ఇటీవలి కాలంలో ద్రవీభవన వేగం పెరగడం లేదన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధ్యయనాలు, ఉపగ్రహ డేటాను ఈ పత్రం ఉటంకించింది.
ఇస్రో ఉపగ్రహ పర్యవేక్షణలో ఆశ్చర్యకరంగా 2001-2011 మధ్య హిమానీనదాలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. కానీ తిరోగమనంలో కొన్ని ముందుకు సాగుతున్నాయి. ఇస్రో పర్యవేక్షించిన 2,018 హిమానీనదాలలో 1,752 స్థిరంగా ఉన్నాయని, 248 వెనక్కి తగ్గుతున్నాయని, 18 ముందుకు వెళుతున్నాయని కనుగొన్నారు.
‘‘హిందువులకు అత్యంత పవిత్రమైన గంగోత్రి గ్లేసియర్ కరగడం గురించి శాస్త్రవేత్తలు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. 30 కిలోమీటర్ల పొడవుండే ఈ హిమానీనదం హిమాలయాల్లో రెండో అతిపెద్దది.. కానీ దాని తిరోగమనం ఇటీవలి కాలంలో ఏడాదికి 10 మీటర్లు (33 అడుగులు) వరకు క్షీణించినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి… ఇదే స్థాయిలో క్షీణత కొనసాగితే మరో 3,000 సంవత్సరాలు పడుతుంది’’ అని పేపర్ పేర్కొంది.
హిమానీనదాల తిరోగమన వేగం, పరిణామాలను మీడియా, పర్యావరణవేత్తలు చాలా అతిశయోక్తి చేశారు.. 2035 నాటికి హిమానీనదాలన్నీ కరిగిపోవచ్చని నోబెల్ విజేత ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (IPCC) 2007 నివేదికను రచయితలు ఖండించారు. తరువాత ఈ ప్రకటనను ఐపీసీసీ ఉపసంహరించడం గమనార్హం.
కో-ఆథర్ వీకే రైనా అధ్యయనాలు.. ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో హిమానీనదాల తిరోగమనం తగ్గుతోందని చూపుతున్నాయి. ‘హిమానీనదాలు కరిగిపోతున్నాయని హెచ్చరికలను జారీ చేసే వ్యక్తులు నిజంతో ఆటలు ఆడుతున్నారు’ అని రచయితలు మండిపడ్డారు. ఇప్పటి వరకూ చేపట్టిన ఏ అధ్యయనం కూడా నదీ ప్రవాహాలకు మంచు, హిమానీనదం కరగడం, వర్షపాతం మధ్య తేడాను గుర్తించలేకపోయాయి.
అయితే, తాజా అధ్యయనం మాత్రం దీనిని మొదటిసారి వివరించింది. ‘హిమానీనదం కరుగుదల సింధు నది ప్రవాహంలో కేవలం ఒక శాతం మాత్రమే.. గంగా, బ్రహ్మపుత్రకు కూడా తక్కువగానే ఉంది. గంగా ప్రవాహానికి 94% వర్షపాతం దోహదపడుతుంది. శీతాకాలపు మంచుతో కప్పి ఉన్న ప్రాంతం హిమానీనదాల కంటే చాలా ఎక్కువగా ఉన్నందున దాని సహకారం చాలా రెట్లు ఎక్కువ’ అని అధ్యయనం సూచిస్తుంది.
Source link