naganna

పేద విద్యార్థులకు వరం లాంటిది – సర్పంచ్ మూలింటి రాధమ్మ

ఆస్పరి (పల్లె వెలుగు)16 ఆగస్టు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్య కనుక పేద విద్యార్థులకు వరం లాంటిదని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మూలింటి రాధమ్మ అన్నారు. సోమవారం మనబడి నాడు నేడు రెండో దశ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు జగనన్న విద్య కానుక కిట్లను సర్పంచ్ మూలింటి రాధమ్మ, వైకాపా జిల్లా సంయుక్త కార్యదర్శి గోవర్ధన్, జిల్లా కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్రల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఖర్చుల కోసం పేద కుటుంబాలు పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో ‘డ్రాప్‌ అవుట్‌‘ లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టుకూలి కలిపి, అలాగే ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ తో పాటు ఇంగ్లీష్-తెలుగు డిక్షనారి కూడా బడులు తెరిచిన తొలిరోజే అందజేయడం చాలా సంతోషకరమైన విషయమని వారు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సుజాత, విద్యా కమిటీ చైర్మన్ గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks