naga ashokSirvella

వివాహానికి హాజరైన టిడిపి యువ నాయకుడు భూమా విఖ్యాత రెడ్డి.

రుద్రవరం (పల్లెవెలుగు) 25 అక్టోబర్: మండలంలోని చిన్న కంభలూరు మెట్ట సమీపంలో ఉన్న కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో జరిగిన వివాహ మహోత్సవ కార్యక్రమానికి ఆళ్లగడ్డ టిడిపి యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సిరివెళ్ల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది రమణ కుమారుడు వివాహమహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెంకట రంగనాయకులు శెట్టి, మీసాల లక్ష్మి నరసయ్య, ఎల్లా వత్తుల సర్పంచ్ చంద్రమోహన్, సిరివెళ్ల మండల టిడిపి నాయకులు శ్రీకాంత్ రెడ్డి మాజీ జెడ్పిటిసి ఫైనాన్స్ గురప్ప, రామ, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to top button