naga ashokSirvella

నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి భూమా విఖ్యాత రెడ్డి.

రుద్రవరం (పల్లెవెలుగు) 24 అక్టోబర్: మండలంలోని డి కొట్టాల టి కొట్టాల గ్రామాలలో వరి పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని టిడిపి యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి తెలిపారు. ఆదివారము ఆయన రుద్రవరం మండలం లోని డి కొట్టాల గ్రామ సమీపంలో ఇటీవల గాలివానకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసిన వరి పంట దాదాపు 500 ఎకరాల్లో పైగా పూర్తిగా నేలకు ఒరిగింది అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా గా రైతులను తీవ్రంగ నష్టపోతున్నారన్నారు. రైతులు పండించిన మొక్కజొన్న పంట గిట్టుబాటు ధర లేక రోడ్లపైనే ఎండ పెట్టుకుంటున్నారు. ప్రభుత్వము మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర 1900 ఇస్తామని చెప్పి ఇంత వరకు పంట కొనుగోలు చేయలేదన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఎరువులు క్రిమిసంహారక మందులు రేట్లు విపరీతంగా పెరగడంతో రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వము రైతులను కూడా టిడిపి రైతులు వైసిపి రైతులని తేడా చూపుతున్నారన్నారు. ప్రభుత్వం దృష్టిలో రైతులందరూ సమానమేనని రైతు లను వేరు చేయకుండా వారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆయన వెంట టిడిపి నాయకులు బా చ్చాపురం శేఖర్ రెడ్డి, లింగం వెంకట రంగనాయకులు, ఎర్రం ప్రతాపరెడ్డి ,బండారు బాలరాజు, మీసాల లక్ష్మి నరసయ్య ,మజ్జిగ చంద్ర, లక్ష్మీకాంత్ యాదవ్, నంద్యాల నారాయణ రెడ్డి, సత్యం రాజు ,నరసింహారెడ్డి, శ్రీనివాసులు, రెక్కల మనోహర్ రెడ్డి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to top button