naga ashokSirvella

గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

శిరివెళ్ళ (వీరారెడ్డి పల్లె) (పల్లెవెలుగు) 22 అక్టోబర్: మండల పరిధిలోని వీరారెడ్డి పల్లె గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామ సర్పంచ్ మందాల రాధిక శివారెడ్డి తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛభారత్ సమావశం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. గ్రామమంతా పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేశారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛ భారత్ పై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

Back to top button