naga ashokSirvella

 స్వచ్ఛ గ్రామాల కోసం స్వచ్ఛ సంకల్పం

ఎంపీడీవో సాల్మన్ రాజ్, మండల ఉపాధ్యక్షురాలు చీమల అనూష రమేష్ రాయల్

శిరివెళ్ళ (పల్లెవెలుగు) 21 అక్టోబర్ : జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని ఎంపీడీవో సాల్మన్ రాజ్ గురువారం స్థానిక ఎంపిడివో ఆఫీసులో జగనన్న స్వచ్ఛ సంకల్పం మండల స్థాయి అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చీమల రమేష్ అనూష, మండల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎంపిడిఓ, మండల ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం అమలు బాధ్యత అనుకొని మనస్ఫూర్తిగా పనిచేయాలని సూచించారు.  వంద రోజుల పాటు ఈ కార్యక్రమం జరగాలన్నారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామం గా అభివృద్ధి చేసేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.  స్వచ్ఛ సంకల్పం ద్వారా ప్రతి గ్రామంలో మార్పు రావాలన్నారు.  ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు తమ ఇళ్ల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకొనెల ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు.  మన పరిసరాల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే వ్యాధులు దరిచేరవని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, పాల్గొన్నారు.

Back to top button