naga ashokSirvella

చంద్రబాబు దీక్షకు ఎర్రగుంట్ల టిడిపి సంఘీభావ నిరసన

చంద్రబాబు దీక్షకు ఎర్రగుంట్ల టిడిపి సంఘీభావ నిరసన

శిరివెళ్ల  (పల్లెవెలుగు) 21 అక్టోబర్ : మండల పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా గురువారం నిరసన వ్యక్తం చేశారు.  అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టిడిపి నేతలపై చేస్తున్న భౌతిక దాడులకు నిరసనగా చేపట్టిన ధర్నా విజయవంతంగా కొనసాగుతున్నది.  పోలీస్ ఆంక్షలను అధిగమించి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది అని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జయరామిరెడ్డి,  మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి, లక్ష్మి రెడ్డి,  సుబ్బారెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Back to top button