naga ashokSirvella

వరిలో సుడి దోమకు ఆర్కెస్ట్రా వజ్రాయుధం

శిరివెళ్ల (పల్లెవెలుగు) 19 అక్టోబర్: : వరి సాగు చేసే రైతులు సుడి దోమ పట్ల తీవ్ర ఆందోళన గా ఉన్నారని వరిలో వ్యాపించే సుడిదోమ కు ఆర్కెస్ట్రా అనే మందు వజ్రాయుధం లా పనిచేస్తుందని రీజినల్ సేల్స్ మేనేజర్ ఎం కృష్ణా రెడ్డి పేర్కొన్నారు  మండల పరిధిలోని గోవింద పల్లి గ్రామంలో నీ  మంగళవారం.L పుల్లారెడ్డి పొలంలో పిచికారి చేయడం జరిగిందని పేర్కొన్నారు అదేవిధంగా అన్నదాత లతో కలిసి వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం రైతులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఆర్కెస్ట్రా పిచికారి చేయడం వల్ల సుడి దోమ తో పాటు అన్ని రకాల దోమలు సమూలంగా నిర్మూలించి వరి లో అధిక పిలకలు వేసి మేలైన దిగుబడితో రైతులకు వరంగా మారిందని ఆర్కెస్ట్రా మందు గురించి వివరించారు. ప్రస్తుతం ఆర్కెస్ట్రా మందును ఆంధ్రప్రదేశ్  తెలంగాణ రాష్ట్రాల లోని రైతులు పిచికారి చేసి సుడి దోమ వల్ల వ్యాపించే తెగుళ్లు వ్యాధుల బారి నుండి ఉపశమనం పొందారని సూచించారు. ఈ కార్యక్రమంలో. సీనియర్ ఏరియా సేల్స్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి  రీజనల్ మేనేజర్ లెనిన్ బాబు సొసైటీ చైర్మన్ నల్లా రాజశేఖర్రెడ్డి ఇ ఉపసర్పంచ్ హిందూరి శేషారెడ్డి   పురుషోత్తం రెడ్డి గ్రామ రైతులు విద్యావేత్తలు వ్యవసాయ పరిశోధన నిపుణులు కంపెనీ ప్రతినిధులు ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

Back to top button