
సమరసత సేవా ఫౌండేషన్ విస్తృత సమావేశం
సిరివెళ్ల (పల్లెవెలుగు) 18 అక్టోబర్ : స్థానిక మండలంలోని గోవిందపల్లి గ్రామం రామాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ధర్మ ప్రచారక్ సాయిరాం,నంద్యాల డివిజన్ ధర్మప్రచార శ్రీనివాసులు మరియు డివిజన్ కన్వీనర్ నాగ మోహన్ రెడ్డి, డివిజన్ సహ కన్వీనర్ చల్లా నాగరాజ్ యాదవ్, సబ్ డివిజన్ ధర్మప్రచార మహేంద్ర చారి మరియు నాగమల్లేశ్వర్ రెడ్డి, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సాయిరాం మాట్లాడుతూ సమరసత సేవా ఫౌండేషన్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మొన్న దినము గోవిందపల్లి గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఉచిత దివ్యదర్శన యాత్ర ను పంపించడం జరిగింది. అలాగే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గడపగడపకు హిందుత్వాన్ని చటడం ప్రతి గ్రామంలో సామూహిక హారతి గో పూజా కార్యక్రమాలు నిర్వహించడం భజనలు చేయించడం అని వారు తెలిపారు. అలాగే హిందుత్వం చాలా గొప్పదని విలువలు కలిగినదని ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రకండ ప్రముఖ వైవి రామయ్య సమరసత సేవా ఫౌండేషన్ కన్వీనర్ దాదిరెడ్డి మహేష్, పార్వతీశం వివిధ గ్రామాల గ్రామస్తులు పాల్గొన్నారు.