naga ashokSirvella

గంగుల సహాయ సహకారాలతో ఎర్రగుంట్ల రైతు సేవ సహకార బ్యాంకు అభివృద్ధి

ఎర్రగుంట్ల (పల్లెవెలుగు) 30 సెప్టెంబర్ : మండల పరిధిలోని మేనేజర్ గ్రామమైన ఎర్రగుంట్ల గ్రామంలో గంగుల సహకారంతో రైతు సేవా సహకార బ్యాంకు ప్రగతి పథంలో దూసుకు పోతున్నట్లు సొసైటీ చైర్మన్ మెరువ చిన్న నాగిరెడ్డి  (బుజ్జి) తెలిపారు. బ్యాంకు అధికారులతో, చైర్మన్, డైరెక్టర్లు కలిసి ఆరు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించడం విధితమే. స్థానిక సహకార సంఘం బ్యాంకు ఆవరణంలో మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 61వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.  గురువారం అనంతరం సొసైటీ చైర్మన్ మేరువాచిన్న నాగిరెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 1 వ తేది 2021 నుండి అక్టోబర్ 30 – 2021 వా సంవత్సరములకు గంగుల సహకారంతో సుమారు ఆరు నెలల్లో సుమారు 49 లక్షల రూపాయలు ఆదాయం రావడం జరిగిందన్నారు. ఈ బ్యాంకు ద్వారా రైతులకు గోల్డ్ లోన్, పంటరుణాలు వివిధ రకాలైన రుణాలను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. వ్యాపార సంస్థలకు కూడా రుణాలు అందిస్తామనారు. రుణాలు తీసుకున్న రైతులు అందరు సకాలంలో చెల్లించి మరల రుణాలను తీసుకోవచ్చునని తెలియజేశారు.  తీసుకున్న రుణాలు చెల్లించడం ద్వారా బ్యాంకు అభివృద్ధి దిశలో నడుస్తుందని  తెలియజేశారు. బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులకు అతి త్వరగా బ్యాంకు  రుణాలను అందజేయడం జరుగుతుందని సక్రమంగా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని తిరిగి చెల్లించాల్సిన వారికి మరల లోను తిరిగి పొందవచ్చునని అన్నారు.  ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు నాగేషు, యపరాల రామయ్య, బ్యాంకు సిబ్బంది, లబ్ధిదారులు ,వినియోగదారులు, తదితరులు ,పాల్గొన్నారు.

Back to top button