naga ashokSirvella

ఆరోగ్యం పదిలంగా ఉండాలని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

శాంతిరాం జనరల్ హాస్పిటల్ నిర్వాహకురాలు జ్యోతి

శిరివెళ్ల (ఎర్రగుంట్ల) 29 సెప్టెంబర్: ఉచిత వైద్య శిబిరం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పంతులుగా ఉండేందుకు శాంతి రామ్ హాస్పిటల్ ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని శాంతిరాం హాస్పిటల్ నిర్వాహకురాలు జ్యోతి  తెలిపారు. మండల పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామంలో బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో సుమారు 700 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, గుండె జబ్బులకు పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ తిప్పయ్య స్వామి బృందం వారు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతా ప్రస్తుత పరిస్థితులలోజబ్బులు లేనప్పుడే మనిషఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జయరామిరెడ్డి ,పుల్లారెడ్డి లతో పాటు గ్రామస్తులు, పేషెంట్లు, తదితరులు, పాల్గొన్నారు.

Back to top button