naga ashokSirvella

అంగరంగ వైభవంగా పోలేరమ్మ తిరణాల

శిరివెళ్ళ (వెంకటాపురం) 29 సెప్టెంబర్: మండల పరిధిలోని వెంకటాపురం గ్రామం లో మంగళవారం అంగరంగ వైభవంగా పోలేరమ్మ తిరణాల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగులతో తీర్చి దిద్ది విద్యుత్ బల్బులతోఅలంకరించారు. అనంతరం పోలేరమ్మకు ఆనవాయితీగా శనిగల కుటుంబం నుండి బోనాలను మంగళ వాయిద్యాలతో తీసుకొని వచ్చారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొని పూజలు నిర్వహించారు. కోరిన కోర్కెలు నెరవేరడంతో స్వామివారికి మెక్కుతీర్చుకున్నారు. కాయ కర్పూరం నొసంగి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వాహకులు ఏర్పాటు చేశారు. గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కోవిడ్ నిబంధనలు పాటించారు.

Back to top button