Gouse Bashamarkapuram

కాంపౌండ్ గోడలు మరియు అవసరార్ధ మరమ్మతుల కొరకు MGNREGS నిధులను సద్వినియోగం చేసుకోండి జానో జాగో

మార్కాపురం (పల్లెవెలుగు) 19 అక్టోబర్:   ప్రకాశం జిల్లాలోని అసంపూర్ణముగా వున్న ముస్లీమ్ శ్మశాన వాటికలకు సంబంధించిన కాంపౌండ్ గోడలు మరియు అవసరార్ధ మరమ్మతుల కొరకు MGNREGS నిధుల ద్వారా నిర్మించుకొనుటకు ఆయా సంబంధిత మసీదుల కమిటీ ఆధ్వర్యములో వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపించిన యెడల తదుపరి చర్యలు తీసుకుంటారని జిల్లా మైనారిటీల సంక్షేమశాఖ  మరియు అదనపు వక్ఫ్ అధికారి పి. ఝాన్సిరాణి తెలియచేశారని ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి మసీదు కమిటీ వారు వినియోగించుకోవలసిందిగా  జానో – జాగో ( ముస్లీమ్ మైనారిటీల అభివృద్ధి సంస్ధ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కర్త షేక్. గౌస్ బాష తెలియచేశారు.

Back to top button