
షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ 91వ వర్ధంతిని జయప్రదం చేయండి – పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు S.M.D.రఫీ
షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ 91వ వర్ధంతిని జయప్రదం చేయండి – పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు S.M.D.రఫీ
కర్నూలు (పల్లెవెలుగు) 21 మర్చి: బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దోపిడీ, పీడన లేని సమాజం కోసం ఉరికంబం ఎక్కిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు 91వ వర్ధంతి సభలను మార్చి 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) రాష్ట్ర కార్యవర్గ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముద్రించిన గోడ పత్రికను పిడిఎస్యు కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో STBC కాలేజీ వద్ద సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు S.M.D.రఫీ, పిడిఎస్యు జిల్లా కోశాధికారి సోమశేఖర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు మరణించి మార్చి 23కి 91 సంవత్సరాలు అయినా వారి అమరత్వాన్ని, పోరాట స్ఫూర్తిని నేటి యువత , విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు కర్నూలు నగర నాయకులు కళ్యాణ్, విశ్వనాథ్, వివేక్, రాజు, విష్ణు, మనోహర్, ఆనంద్, ప్రకాష్, రాము తదితరులు పాల్గొన్నారు.