Abdul JavidAllagadda

ఆళ్లగడ్డ అభివృద్ధిని మరిచిన వైఎస్ఆర్సిపి – మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) 26 ఆగష్టు:  మున్సిపాలిటీ లో సమస్యలను పరిష్కరించడంలో వైఎస్ఆర్సిపి నాయకులు విఫలమయ్యారని  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె  మాట్లాడుతూ ఆళ్లగడ్డలో ప్రతిపక్షం కేవలం తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్సిపి పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లేనని ఆమె అన్నారు.  నియోజకవర్గంలో ఏ ఒక అభివృద్ధి పని చేసుకోలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారని అన్నారు అలాగే ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ వై ఎస్ ఆర్ సి పి. మరియు మెజారిటీ కౌన్సిలర్లు కూడా వైఎస్సార్సీపీ సభ్యులేనని అన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా వైసీపీ నుంచి గెలుపొందిన వారే అని అన్నారు. కానీ ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో మెజారిటీవైసీపీ సభ్యులు ఉన్న కూడా లేకుండా కౌన్సిల్ సమావేశం వాయిదా వేశారు అంటే వైసిపి నాయకులు ఆళ్లగడ్డలోవైసీపీ ప్రతిపక్ష హోదాలో ఉన్నారా? ఎందుకు వాయిదా వేశారని ఆమె ప్రశ్నించారు. ఆళ్లగడ్డలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సొంత పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ ను మరియు కమిషనర్ను నిలదీయడం సిగ్గుచేటని అన్నారు ఇలాంటి విచిత్ర సంఘటన ఆళ్లగడ్డ మున్సిపల్ కౌన్సిలర్ చోటు చేసుకోవడం చాలా బాధాకరం అన్నారు ఆళ్లగడ్డ లో వార్డులలో వైసీపీ కౌన్సిలర్లు కనీస అభివృద్ధి పనులు కూడా చేసుకోలేని పరిస్థితులలో ఉండటం బాధాకరం అన్నారు. ఆళ్లగడ్డలో వైసిపి నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు అధికారులను అడ్డంపెట్టుకుని టిడిపి అభ్యర్థులు లొంగదీసుకుని భయపెట్టే వారిని  నామినేషన్లు వేయకుండా చేయటం అలాగే నామినేషన్లు వేసిన వారిని పక్కకు తీసుకొని పోయి మున్సిపాలిటీలో మెజారిటీ పొందారు.  అధికారులు పనులు చేస్తున్నారా లేదా అనే చూసుకోలేని  ఎమ్మెల్యే ఆళ్లగడ్డ ఎక్కువ ఉండటం దురదృష్టకరమని అన్నారు మున్సిపాలిటీలో ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టడానికి కూడా నిధులు లేవని ఒకపక్క మున్సిపల్ చైర్మన్ అంటూ ఉంటే పగటిపూట కూడా ఆళ్లగడ్డలో లైట్లు వేసిఉంచటం వారి నిర్లక్ష్య ధోరణి కనబడుతున్నారు. ఈ ప్రభుత్వంలో చెత్తకు పన్ను. ఇంటికి పన్ను  ఖాళీ స్థలానికి ఉన్న కూడా పన్నులు విధించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు 14 ఫైనాన్స్ కింద 14 కోట్లు నిధులు ఉన్న కూడా దాదాపుగా కూడా ఇప్పుడు  కేవలం మూడు కోట్ల పనులకు సంబంధించిన పనులు మాత్రమే ఆళ్లగడ్డలో చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదంటే మీరు అధికారంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనని అన్నారు ఎమ్మెల్యే గారు మరియు ఎమ్మెల్సీ గారు ముఖ్యమంత్రిని కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వటమే దానికి పరిమితమయ్యారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్లు ముఖ్యమంత్రిని కలిసి ఒక అర్జీ రూపంలో ఆళ్లగడ్డ లో ఉన్న అభివృద్ధి పనులకు సీఎం గారితో చర్చించి సంతకం చేయించి శాంషన్ చేసిదానిపైన  కింద ఉన్న సెక్రటరీ వాళ్లకు పోస్ట్ చేస్తారన్నారు. అలా పనులు చేయించుకోకుండా ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ గారు సీఎంతొ ఫోటోలు దిగటానికి పరిమితమయ్యారని వారు అన్నారు. ఆళ్లగడ్డలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందన్నారు అలాగే ఆళ్లగడ్డలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వుందన్నారు .మున్సిపాలిటీపరిధిలో మంచినీరు సరఫరా సరిగా జరగడం లేదన్నారు మున్సిపల్ కమిషనర్ సరిగా పనిచేయడం లేదని అన్నారు దీనిపై జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు

Back to top button
Enable Notifications    OK No thanks