Telangana State

 బీజేపీ కార్యకర్తలపై దాడులు ఆపాలి

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అరుణతార. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతున్న బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అరుణతార మండలంలో బీజేపీ లీడర్ల ఫై దాడులు, అక్రమ కేసులు నమోదు చేయడంతో ఆదివారం బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అరుణతార ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో రోజు రోజుకు బీజేపీ లీడర్లపై టిఆర్ ఎస్ లీడర్లు దాడులు చేస్తున్న  పోలీసులు రక్షించాల్సింది పోయి బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఏకపక్షంగా టిఆర్ ఎస్ లీడర్లకు మద్దతు ఇస్తూ బాదితులపైనే కేసులు నమోదుచేస్తామని బెదిరిస్తునట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రురల్ సీఐ చంద్రశేఖర్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ సాయిలు, మహిళా ప్రెసిడెంట్ స్వరూప, జిల్లా లీడర్లు రాము, బాలు, చంద్రశేఖర్, విశ్వనాథం, శ్రీకాంత్, చిరంజీవి, నరేందర్ పాల్గొన్నారు.

నిజాంసాగర్ బస్టాండ్ ను సందర్శించిన బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అరుణతార.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బస్టాండ్ ను పరిశీలిస్తున్న బీజేపీ లీడర్లు.  నిరుపయోగంగా మరీన నిజాంసాగర్ బస్టాండ్ మరుగుదొడ్లు. నిజాంసాగర్ బస్టాండ్ లో ఆర్టీసీ యాజమాన్యం ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురుతున్నారని బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అరుణతార ఆరోపించారు. ఆదివారం నిజాంసాగర్ టౌన్ లో శిథిలావస్థకు చేరిన బస్టాండ్, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మహిళా ప్రయాణికులు మరుగుదొడ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లా వాసి ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారని ఇప్పటికైనా  నిజాంసాగర్ బస్టాండ్ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. నిజాంసాగర్ బస్టాండ్ లో షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఆదాయం వస్తున్నా ఎటువంటి పనులు చేయక పోవడంతో మండలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గ బస్టాండ్ ల అభివృధ్ధికోసం త్వరలో ధర్నా చేస్తామని బీజేపీ లీడర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ సాయిలు, మహిళా ప్రెసిడెంట్ స్వరూప, జిల్లా లీడర్లు రాము, బాలు, చందు, విశ్వనాథం, శ్రీకాంత్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Back to top button