Telangana State

సజ్జనార్ బదిలీ

 సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయన స్థానంలో స్టీఫెన్ రవీంద్రను నియమించింది. సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనర్ గా సజ్జనార్ మూడేళ్ల పాటు విధులు నిర్వహించారు. తన పదవీ కాలంలో ఆయన సమర్థవంతమైన పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ ఆయన హయాంలోనే చోటుచేసుకుంది. మరోవైపు స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీపీగా ఉన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks