National News

వివాహంలో విషాదం.. బావిలో పడి13 మంది మహిళల మృతి

వివాహంలో విషాదం.. బావిలో పడి13 మంది మహిళల మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలోపెళ్లి వేడుకకు హాజరైన వారిలో 13 మంది మహిళలు బావిలో పడి మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లా నెబువా నౌరంజియాలో జరిగింది. పెళ్లికి హాజరైన వారిలో పలువురు మహిళలు సమీపంలోని ఓ బావి స్లాబ్‌పై కూర్చున్నారు. వారి బరువుకు తట్టుకోలేని ఆ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దానిపై కూర్చున్న వారందరూ బావిలో పడిపోయారు. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు ఆనందంగా సాగిన వివాహ వేడుక ఈ ఘటనతో విషాదంగా మారిపోయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల  చొప్పున పరిహారం ప్రకటించారు.

Back to top button