jsr newsKurnool

చోరీ కేసును ఛేదించిన సిఐ బి.శేఖర్ కి ఘన సన్మానం

ఉరవకొండ (పల్లెవెలుగు) సెప్టెంబర్ 29: నియోజకవర్గ పరిధిలోని విడపనకల్లు మండల కేంద్రంలో  చోరీ  కేసును చేధించిన ఉరవకొండ సిఐ బి.శేఖర్ బాబు ను ఉరవకొండ మరియు విడపనకల్ ట్రాన్స్ జెండర్స్  ఘనంగా సన్మానించారు పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఆవరణలో సీఐ శేఖర్ బాబుకు శాలువా కప్పి పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ అనుష్క మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని విడపనకల్లు మండల కేంద్రంలో గత నెల 31 వ తేదీన తన ఇంటి పైకప్పున నిద్రిస్తుండగా క్రింద ఇంటిలో  గుర్తుతెలియని వ్యక్తి  ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం  నాలుగు లక్షల రూపాయలు నగదును చోరీ చేయడం జరిగింది అని ఆ  మేరకు ఉరవకొండ సి.ఐ బి శేఖర్ బాబు ఎంతో చాకచక్యంగా దొంగను పట్టుకొని తన సొమ్మును రికవరీ చేసి ఎంతో సహాయ పడారని అన్నారు ఈ కార్యక్రమంలో అనుష్క తో పాటు, సుజాత, సాయి సమీరా, విన్ని, పూజ, నాగలక్ష్మి, హారిక, రాజీ, వైశాలి, నాగ లక్ష్మి, వనజ, శ్రీ లక్ష్మి, మధులత, కుమారి, రేణుక, శర్మ పాల్గొన్నారు

Back to top button