
small eyes advantages, కళ్లు చిన్నగా ఉంటే ఇంత లాభమా.. నవ్వులు పూయిస్తున్న మంత్రి వీడియో – advantages of having small eyes, nagaland bjp chief speech video goes viral
‘అంతేకాదు, సుదీర్ఘంగా సాగే భారీ సమావేశాల్లో స్టేజి మీద అధిక సమయం కూర్చోవాల్సి వచ్చినప్పుడు మాకొక ప్రత్యేకమైన వెసులుబాటు ఉంటుంది. నిద్రపోయినా ఎవరూ గుర్తించలేరు’ అంటూ తెమ్జెన్ ఇమ్నా నవ్వులు పూయించారు. నాగాలాండ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ఆ రాష్ట్ర విద్యా శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న తెమ్జెన్ ఇమ్నా ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెమ్జెన్ ఇమ్నా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆజ్‌తక్ న్యూస్ యాంకర్ శుభంకర్ మిశ్రా ట్విటర్ ద్వారా షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌పై ఇమ్నా కూడా హర్షం వ్యక్తం చేస్తూ రీట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు జర్నలిస్టుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఇమ్నా తనపై తాను వేసుకున్న జోకులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు..
Also Read:
వైఎస్ విజయమ్మ రాజీనామాపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
ఫస్ట్ షాట్ మిస్సైంది.. అలా చేసుంటే షింజో అబే బతికేవారు, వీడియో వైరల్