
నేడు టిడిపి కార్యాలయం ప్రారంభం
నేడు టిడిపి కార్యాలయం ప్రారంభం
ఎర్రగుంట్ల (పల్లె వెలుగు) ఏప్రిల్ 6: జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఎర్రగుంట్ల లో విపక్ష తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించనున్నారు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భూపేష్ రెడ్డితోపాటు జిల్లాలోని పార్టీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు ముందుగా స్థానిక నాలుగు రోడ్ల కూడలి నుండి కడప రోడ్డు లోని పార్టీ కార్యాలయం వరకు కార్యకర్తలతో ర్యాలీ జరగనుంది అనంతరం కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభిస్తారు ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి నాయకుల ప్రసంగాలు ఉంటాయి ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన సన్నాహాలు పూర్తిచేశారు బుధవారం నారాయణ రెడ్డి భూపేష్ రెడ్డి ఇక్కడికి చేరుకొని పనులను పర్యవేక్షించారు గురువారం మధ్యాహ్నం కార్యకర్తలకు భోజన సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు.