yerraguntlaNasib Basha

రాయలసీమ రణభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

రాయలసీమ రణభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

యర్రగుంట్ల (పల్లె వెలుగు) 16 మార్చి: రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ మార్చి 19న కడప జిల్లా కేంద్రంలో రాయలసీమ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బిజెపి మండల ఇంచార్జ్ మేకల జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఏర్పాటుచేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన  మీడియా తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి ఆదేశానుసారం  బిజెపి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగిందని రాయలసీమ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అనేక ప్రాజెక్టులను వైసీపీ అధికార పార్టీ నిర్లక్ష్యం చేస్తున్నారని యువతకు ఉద్యోగాలు లేకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19వ తేదీ కడపలో చేపట్టిన రాయలసీమ రణభేరి ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు సైతం హాజరవుతున్నారని అలాగే ఎర్రగుంట్ల నుండి దాదాపు మూడు వేల మంది ఆదినారాయణ రెడ్డి  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని మరియు బిజెపి కార్యకర్తలు నాయకులు ప్రజలు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సత్యానందస్వామి, బీజేపీ కిసాన్ మొర్చ్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి, బిజెపి మండల నాయకులు  జంగం రెడ్డి,బాబు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks