yerraguntlaNasib Basha

నాపై కక్ష కట్టారు కమిషనర్ కు ఆర్పి ఫిర్యాదు.

నాపై కక్ష కట్టారు కమిషనర్ కు ఆర్పి ఫిర్యాదు.

యర్రగుంట్ల (పల్లె వెలుగు ) ఫిబ్రవరి 24 : తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ విధుల నుండి తనను తొలగించేందుకు చూస్తున్నారని ఎర్రగుంట్ల పురపాలిక పరిధిలోని శ్రావణి అనే ఆర్ పి బుధవారం మున్సిపల్ కమిషనర్ పగడాల జగన్నాథ్ కు అందజేసిన ఓ వినతి పత్రంలో ఫిర్యాదు చేశారు 2019 మే నెల నుండి తాను డ్వాక్రా సంఘాల కు సంబంధించిన ఆర్ పి గా పనిచేస్తున్నానని ఇప్పటివరకు సంఘ సభ్యుల ద్వారా తాను ఎలాంటి లంచాలు పుచ్చుకో లేదని స్పష్టం చేశారు అయితే తనకన్నా ముందు ఉన్న ఆర్ పి లంచాలు తీసుకున్న మాట వాస్తవమేనని అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఈ కారణంగానే తనను పాత ఓబి బెదిరిస్తూ సామూహిక సమావేశాలకు అడ్డుపడటంతో పాటు కక్షగట్టి విధుల నుండి తొలగించేందుకు కూడా చూస్తున్నారని శ్రావణి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ విషయంపై తాను ఇది వరకే పిడి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. గతంలో ఆడిట్ రికార్డుల్లో డీసీబీ లో చాలా అవకతవకలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. కాగా  ఈ వినతి పత్రం పై కమిషనర్ స్పందిస్తూ శ్రావణి ఇచ్చిన వినతి పత్రాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Back to top button