yerraguntlaAbdul Javid

అక్రమ మద్యం పట్టివేత.

అక్రమ మద్యం పట్టివేత.

యర్రగుంట్ల (పల్లె వెలుగు)11 ఫిబ్రవరి: యర్రగుంట్ల మార్కెట్ యార్డ్ ఎదురుగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తినీ పట్టుకున్నామని  సీఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు కడప రోడ్డు లో గల మార్కెట్ యార్డ్ ఎదురుగా అక్రమంగా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయిస్తున్న నరాల పవన్ కుమార్ అనే వ్యక్తి వద్ద నుండి 33 మద్యం ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని నిందితుడు పవన్ కుమార్ ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కృష్ణయ్య ప్రవీణ్ సిబ్బంది పాల్గొన్నారు.

Back to top button