yerraguntla

ఎర్రగుంట్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి.

ఎర్రగుంట్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి.

ఎర్రగుంట్ల పల్లెవెలుగు (జనవరి25): పారిశ్రామిక ప్రాంతమైన ఎర్రగుంట్ల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ఆ మేరకు అనేక అభివృద్ధి పనులు మంజూరు చేయించానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం పురపాలిక పరిధిలోని 20వ కౌన్సిల్ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి వార్డు కౌన్సిలర్ అలీతో కలిసి ఆయన వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీగా ఉన్న ఎర్రగుంట్ల ను 2012లో నగర పంచాయతీగా మార్పు చేసి ప్రజలపై పన్నుల భారాన్ని మోపిన ఘనత అప్పటి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికే దక్కుతుంది అని ఎద్దేవా చేశారు. ఆదినారాయణ రెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని అన్నారు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం లో తాను ఎర్రగుంట్లలో అనేక అభివృద్ధి పనులు చేపట్టానని గుర్తుచేశారు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు మురుగు కాలువలు వలసపల్లె రస్తా అభివృద్ధి పనులతో పాటు నూతన మున్సిపల్ కార్యాలయ భవనం అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణం పనులను చేపట్టడం జరిగిందని వివరించారు గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యం అని ఎద్దేవా చేశారు కాగా వార్డు పర్యటనలో ఎమ్మెల్యే ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ సుడిగాలి పర్యటన చేశారు సంక్షేమ పథకాలు అమలు తీరు తెన్నుల పై ఆరా తీశారు కౌన్సిలర్అలీ వెంటరాగా ఎమ్మెల్యే చైర్మన్ ప్రజలతో మమేకమయ్యారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తొలుత నేతలకు కౌన్సిలర్ అలీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది.

Back to top button