Nasib Bashayerraguntla

విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు

కొరవడిన పర్యవేక్షణ ప్రజాధనం దుర్వినియోగం.

కడప జిల్లా యర్రగుంట్ల (పల్లెవెలుగు) సెప్టెంబర్ 28: పారిశ్రామిక ప్రాంతమైన యర్రగుంట్ల పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఎర్రగుంట్ల పట్టణం కడప రోడ్డు లోని జువారి రైల్వే ట్రాక్ వద్ద నుండి ముద్దనూరు రోడ్డు లోని ఐసిఎల్ వంక వరకు రూ 33 కోట్ల తో రోడ్డును నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు నేషనల్ హైవే అథారిటీ పనులను చేపట్టింది అయితే ప్రజలు ఆశించిన రీతిలో పనులు కొనసాగడం లేదు దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల పేరిట కొనసాగుతున్న పనుల్లో నియమ, నిబంధనలను గాలికి వదిలేయడం జరిగింది. కనీసం ఆర్ అండ్ బి పరిధి కైన ఆక్రమణలు తొలగించక పోవడం కాంట్రాక్టు సంస్థ ఇష్టారాజ్యంగా పెద్ద పెద్ద రాళ్లతో కూడిన గ్రావెల్ మట్టిని వినియోగించడం తుదకు రెండు అడుగుల మేర గుంతలను తవ్వి నాపరాళ్ల కటింగ్ పీసుల పైన గ్రావెల్ ను లెవెల్ చేయడం జరిగింది. రక్షిత మంచినీటి పైపులైన్లు మార్పు పనుల్లో కూడా నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలి వేయడంతో కడప రోడ్డు లో పైపులు ఇప్పటికే రెండు సార్లు దెబ్బతిన్నాయి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ముద్దనూరు రోడ్డులో నిర్మించిన మరుగు కాలువలను కూడా నాసిరకంగా చేశారన్న ఆరోపలున్నాయి చాలా ఏళ్ళ క్రితం ఇర్కన్ కంపెనీ నిర్మించిన రోడ్డు ఇప్పటికీ చెక్కుచెదర కుండ ఉంది నాడు ఆ కంపెనీ పాటించిన నాణ్యతా ప్రమాణాలను నేటి కాంట్రాక్టు సంస్థ పాటించడంలేదని యర్రగుంట్ల ప్రజలు విమర్శిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులతో కొనసాగుతున్న ఈ పనులను ఏ అధికారి పర్యవేక్షించక పోవడం గమనార్హం పని వద్ద ప్రభుత్వ ఉద్యోగి గాని, అధికారి గాని అసలు కనిపించకపోవడం బట్టే ఈ పనుల నాణ్యతను అర్థం చేసుకోవచ్చు జాతీయ రహదారి పనులు అధ్వానంగా ఉన్నాయంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించక పోవడం విశేషం ఇదిలా ఉండగా యర్రగుంట్ల రహదారి పనుల్లో కొరవడిన నాణ్యతపై మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి  న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా అందుతున్న సమాచారం అదే జరిగితే క్వాలిటీ కంట్రోల్ బోర్డు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరుగుతుంది.

Back to top button