Nasib Bashayerraguntla

దివ్యాంగునికి సైకిల్ వితరణ

పల్లె వెలుగు (ఆగస్టు 19):యర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామపంచాయతీ పరిధిలోనిరాయలసీమ ధర్మల్ విద్యుత్ కేంద్రంలో బుధవారం రాష్ట్ర దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షులు మహీంద్రా మూడు చక్రాల సైకిల్ ను అందజేసిన ఘటన చోటుచేసుకుంది ఆర్టీపీపీ లోనిఎద్దుల ఆనంద్ అనే దివ్యాంగుడు చాలా రోజులుగా సైకిల్ కోసం పరితపించడం జరిగింది ఓ దశలోమూడు చక్రాల సైకిల్ ఇప్పిస్తానంటూ ఓ ప్రబుద్ధుడు పదివేల రూపాయలు అతడి వద్ద స్వాహా చేయడం జరిగింది అయినా ఎద్దుల ఆనంద్ కోరిక నెరవేరలేదు చివరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహకారంతో రాష్ట్ర దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షులు మహేంద్ర ఎద్దుల ఆనంద్ కళనెరవేరుస్తూ నేడు సైకిల్ ను అందజేయడం జరిగింది సైకిల్ ను అందుకున్న ఆనంద్ భావోద్వేగంతో మాట్లాడుతూ తాను ఎన్నో రోజులుగా సైకిల్ వాహనం కోసం చాలా మందిని కలిశానని, కలిసి కోరానని, ఇప్పటికీ తన కల నెరవేరిందని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks