ysrNasib Basha

నగరపాలిక మరియు పురపాలక పాఠశాలల విలీనం అనాలోచితపు తొందరపాటు నిర్ణయం – ఐటా

నగరపాలిక మరియు పురపాలక పాఠశాలల విలీనం అనాలోచితపు తొందరపాటు నిర్ణయం – ఐటా

వైఎస్ఆర్ (ఆంధ్రప్రతిభ) 03 జూన్:  రాష్ట్రంలోని నగరపాలిక మరియు పురపాలక పాఠశాలల యొక్క ఆస్తులు మరియు సిబ్బందితో సహా  విద్యాశాఖలో విలీనం చేయడం తగదని ఇది అనాలోచితపు తొందరపాటు నిర్ణయమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ (ఐటా) యొక్క రాష్ట్ర శాఖ అధ్యక్షులు యేస్.అబ్దుల్ రజాక్, మరియు కడప జిల్లా శాఖ అధ్యక్షులు యస్. నజిర్ బాషా తెలియజేసినారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నగర పాలిక మరియు పురపాలిక పాఠశాలల్లోని ఉపాధ్యాయులతోను,  వారి సంఘ నాయకులతోను మరియు టీచర్ ఎమ్మెల్సీ లతోనూ కూలంకుషంగా చర్చించకుండా, ఏకపక్షంగా ప్రభుత్వం విలీన ప్రతిపాదనలు పంపడం దారుణమని, అప్రజాస్వామికం అని తెలియజేసినారు. ఇప్పటికైనా ప్రభుత్వం తొందరపడకుండా అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని ఐటా రాష్ట్రశాఖ అధ్యక్షుడు యస్. అబ్దుల్ రజాక్ కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యస్.నజీర్ బాషా, కార్యదర్శి ఎస్.అబ్బాస్ అలీ,  జాతీయ కార్యదర్శి ఎస్. షాకిర్ హుస్సేన్, S.ఫకృద్దిన్, ఎండీ.ఫయాజుర్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button