ysrAbdul Javid

మిర్రర్ ఇమెజ్ పాఠ్య పుస్తకాలు  సకాలంలో అందించండి – రూట

మిర్రర్ ఇమెజ్ పాఠ్య పుస్తకాలు  సకాలంలో అందించండి – రూట

కడప (ఆంధ్రప్రతిభ) 27 మే: రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం పాఠశాలలకు మిర్రర్ ఇమెజ్ పాఠ్య పుస్తకాలు సకాలంలో అందించాలని అలాగే అనువాదకుల రెండు సంవత్సరాల గౌరవ వేతనం ఎడు, ఎనిమిది ఉర్దూ పాఠ్య పుస్తకాల రచయితల గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ హిదాయతుల్లా, రాష్ట్ర ప్రథాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ వినతి పత్రాన్ని యస్సిఇఆర్టి సంచాలకులు డాక్టర్ ప్రతాప్ రెడ్డి కడప సందర్శన సందర్భంలొ శుక్రవారం సాయంత్రం ఆయన కు అందించారు. ఈ సందర్భంగా ఎస్ సి ఇ ఆర్ టి సంచాలకులు బి. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మిర్రర్ ఇమెజ్ పాఠ్య పుస్తకాలు ప్రింటింగ్ దశ లో ఉన్నాయని, పాఠశాలలు ప్రారంభం లొపె అందజేస్తామని అలాగే త్వరలో అనువాదకుల రచయితల గౌరవ వేతనాలు విడుదల చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రూట రాష్ట్ర నాయకులు షాహిదుల్లా, సత్తార్ ఫైజి, అయ్యుబ్ , ఇర్షాద్ , హకీం , సిరాజుద్దీన్ లు పాల్గొన్నారు

Back to top button