ysr

ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోకూడదు

ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోకూడదు

కడప (ఆంధ్రప్రతిభ) 25 మే:  ఇష్టం లేని పి ఆర్ సి ఇచ్చినందుకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో బాధ పడుతున్నారని, ఇలాంటి పరిస్థితులలో సిపిఎస్ రక్కసి ని రద్దు చేసి ఓపిఎస్ వరం అందించాలని, ప్రభుత్వ భాగస్వాములైన ఉద్యోగ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోకూడదని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం  స్థానికంగా ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.  కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు షాహిదుల్ల మాట్లాడుతూ  సిపిఎస్ రద్దు వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నామని , కేవలం జీతభత్యాల పై ఆధారపడే ఉద్యోగ ఉపాధ్యాయులు వారి కుటుంబాలు కేవలం ఓ పి ఎస్ మాత్రమే కోరుకుంటున్నారని జి పీ ఎస్ అంగీకరించే పరిస్థితులు లేవని పిఆర్సి మాదిరిగా జిపిఎస్ ను రుద్ధవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు హిదాయతుల్ల ,రాష్ట్ర నాయకులు  , సత్తార్ ఫైజి, ఇర్షాద్, సిరాజ్, అయ్యుబ్, జిల్లా అధ్యక్షులు హాజీ అబ్దుల్ హకీమ్, ప్రధాన కార్యదర్శి సబాతుర్ రహ్మాన్,జిల్లా నాయకులు పర్వెజ్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button