
ఉర్దూ అధ్యాపకుల పోస్టులు కొనసాగించాలి
ఉర్దూ అధ్యాపకుల పోస్టులు కొనసాగించాలి
కళాశాల విద్య కమీషనర్ ను కోరిన రూట లెక్చరర్స్ వింగ్
కడప (పల్లెవెలుగు) 08 మే: రాష్ట్రం లోని అన్నమయ్య , చిత్తూరు జిల్లాల లోని రాయచటి, పలమనేరు, మదనపల్లి డిగ్రీ కళాశాలల లో అధిక సంఖ్యలో ఉర్దూ మీడియం విధ్యార్థులున్నప్పటికి క్రమబద్ధీకరణ పేరుతో ఉర్దూ అధ్యాపకుల పోస్టులు రద్దు చేశారని పోస్టులను ఎదావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ హిదాయతుల్లా రూట అధ్యాపకుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సయ్యద్ వసివుల్లా బఖ్తియారి సాహెబ్ లు ఆదివారం ఉదయం కడప నగరం లోని మానస ఇన్ లో కళాశాల విద్య కమీషనర్ డాక్టర్ పోల భాస్కర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా వారు మాట్లడుతూ గత నెల రోజులుగా రూట సంఘం ఆధ్వర్యంలో మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు , అధికారులకు ఉర్దూ అధ్యాపకుల పోస్టులను కాపాడాలని కోరామన్నారు. స్పందించిన కళాశాల విద్య కమీషనర్ డాక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ ఉర్దూ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని తెలుసుకొని, ప్రజాప్రతినిధుల మరియు రూట ఉర్దూ అధ్యాపకుల విభాగం విజ్ఞప్తి మేరకు రెండు రోజుల క్రితమే ఆయా కళాశాలల పోస్టులు పునరుద్ధరిస్తూ ఉత్తర్వుల జారీ చేశామని తెలిపారు. రూట సంఘం తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో రూట రాష్ట్ర సమన్వయకర్త ముహమ్మద్ అయ్యూబ్, అధ్యాపకుల విభాగం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు డాక్టర్ ఫారూఖ్ బాషా, అంజమన్ తరక్కి ఉర్దూ కౌన్సిల్ సభ్యులు నజీర్ బాషా తదితరుల పాల్గొన్నారు.