ysrMani News

సంచార జాతులు – పోరుబాట

“సంచార జాతులు – పోరుబాట”

  • అనే కార్యక్రమంలో ఏపీ బిజెపి DNT నాయకులు .
  • రాష్ట్ర DNT  కన్వీనర్ చంద్రశేఖర్ రాష్ట్రవ్యాప్త పర్యటన.
  • కడప జిల్లా DNT  కన్వీనర్ దొమ్మరి శ్రీనివాసులు,
  • కో కన్వీనర్ సుంకర మధుసూదన్, జిల్లా బిజెపి నాయ
  • కులు కంచి శ్రీనివాసులు పర్యటనలో పాల్గొన్నారు.

కడప  (పల్లెవెలుగు) 07 మర్చి: సంచార జాతుల సమస్యలు తెలుసుకొని, వారిని  అభివృద్ధి చేయడం కొరకు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఏపీ బిజెపి రాష్ట్ర DNT  కన్వీనర్ అరబోలు చంద్రశేఖర్ పూసల కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఉత్సలవరం  గ్రామానికి విచ్చేశారు. ఈ కార్యక్రమము  కడప జిల్లా కో కన్వీనర్ సుంకర మధుసూదన్ ఆధ్వర్యంలో  సంచార జాతికి చెందిన పిచ్చిగుంట్ల వంశరాజ్ సామాజిక వర్గాన్ని సమావేశపరచి వారి సమస్యలు తెలుసుకున్నారు. జిల్లా DNT  కన్వీనర్  శ్రీనివాసులు దొమ్మర  మాట్లాడుతూ సంచార జాతులు అభివృద్ధి ఒక్క నరేంద్ర మోడీ తోనే సాధ్యం అని , సంచారజాతుల అంతా బిజెపి సమావేశ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజెపి పార్టీని బలపరచాలని పిలుపునిచ్చారు. అలాగే కడప జిల్లా DNT  కోకన్వీనర్ సుంకర మధుసూదన్ మాట్లాడుతూ సంచార జాతులు ఆర్థికంగా విద్య ఉద్యోగ రంగాలలో వెనుకబడి సామాజిక హోదా కోల్పోయి, దీనమైన అవస్థలో జీవిస్తున్నారని  ఆవేదన వెలిబుచ్చారు. మధుసూదన్  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం  సంచార జాతులు ఆర్థికంగా బలపడటానికి సీడ్ అనే సంక్షేమ పథకాలు ప్రారంభించిందని , వాటిని సంచార జాతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిజెపి జిల్లా నాయకుడు కంచి శ్రీనివాసులు మాట్లాడుతూ సంచారజాతులకు ప్రత్యేక  రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం తొందరలో అమల చేస్తుందని, సంచార జాతుల సమస్యలను బిజెపి నాయకుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్ పూసల మాట్లాడుతూ సంచార జాతులు అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా ముందుకు రావాలని, వారి రాజకీయ అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఎన్నో అవకాశాలు ఇస్తుందని ఈ రాజకీయ అవకాశాలను ప్రతి వారు  సద్వినియోగం చేసుకుంటూ  రాజకీయంగా అభివృద్ధి చెంది వారి వారి సామాజిక వర్గాలను తద్వారా అభివృద్ధి చేసుకోవాలని కోరారు. అదేవిధంగా సంచారజాతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి, రాష్ట్ర ప్రభుత్వం పై అందరం కలిసికట్టుగా పోరాడటానికి  ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో బిజెపి పార్టీ సంచారజాతుల సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యమాలు చేస్తూ వారికి అండగా నిలిచిందని  తెలిపారు . అలాగె నరెంద్ర మోడీ సంచార జాతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారని , వాటిని అందరు వినియోగించుని అభివృద్ది చెందాలని సూచించారు .

Back to top button