ysr

స్పందన లేని ప్రభుత్వ యంత్రాంగం.

కడప జిల్లా (పల్లెవెలుగు) డిసెంబర్ 8: పారిశ్రామిక ప్రాంతమైన యర్రగుంట్ల లో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారినప్పటికీ సంబంధిత ప్రభుత్వ శాఖలు స్పందించక పోవడం శోచనీయం అభివృద్ధి పేరిట నెలలు గడుస్తున్నా పూర్తికాని పనులు ఓ వైపు నిర్లక్ష్యంగా తవ్విన గోతులను పూర్చకుండ వదిలేసిన కారణంగా ట్రాఫిక్ అభిమన్యుడి పద్మవ్యూహంల మారింది ఒక సిమెంట్ పైపులైన్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా పాలకులు అధికారులు చర్యలకు ఉపక్రమించక పోవడం దారుణం ప్రశ్నించే విపక్ష పార్టీలు కనుమరుగు కావడంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై స్పందిస్తున్న దాఖలాలు లేవు ప్రజల్లో నెలకొంటున్న వ్యతిరేకతను పాలక పార్టీ నేతలు గ్రహించాల్సి ఉంది యుద్ధ ప్రాతిపదికన రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది లేని పక్షంలో ప్రజా వ్యతిరేకతను అధికార పార్టీ సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పక తప్పదు.

Back to top button