ysr

వైఎస్ఆర్ పెళ్ళి కానుకను పునరుద్ధరించాలి – ఐవైయం

కడప (పల్లె వెలుగు) ఆగస్టు30: ఉప ముఖ్యమంత్రి  అంజద్ బాషాని ఐవైయం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇబ్రాహీం షరీఫ్ ఆదివారం కడపలోని క్యాంప్ ఆఫీస్ లో కలసి వైఎస్ఆర్ పెళ్ళికానుకను త్వరితగతిన పునరుద్దరించాలని కోరారు. ఈ సందర్భంగా ఇబ్రాహీం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ పెళ్ళికానుక పధకాన్ని  పునరుద్దరించి పేద‌ ముస్లిం‌ యువతులకు బాసటగా నిలువాలని కోరారు. ఈ సందర్భంగా ఉప‌ ముఖ్యమంత్రి వర్యులు అంజాద్ బాషా మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం‌ ముస్లిం‌ మైనారిటిలకు ఎన్నో పధకాలు ప్రవేశపెడుతుందని అందులో భాగంగా వైఎస్ఆర్ పెళ్ళికానుక ను కూడ సాధ్యమైనంత త్వరగా ఆమలు చేసే కార్యక్రం చేపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవైయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలీముల్లా ఖాన్ ఐటా కడప జిల్లా అధ్యక్షులు నజీర్ జమాత్ సభ్యులు రహీం తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks