visakhapatnam

మున్సిపల్ విద్యా వ్యవస్థ ను పటిష్టపరచాలి –  APMTF

మున్సిపల్ విద్యా వ్యవస్థ ను పటిష్టపరచాలి –  APMTF

విశాఖపట్నం (ఆంధ్రప్రతిభ) 24 మే: ఆంధ్ర ప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య (AP MTF) రాష్ట్ర అధ్యక్షుడు టి. వెంకట రెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. రవి సిద్దార్థ , పలు జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర నాయకులు కమీషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయిన ప్రవీన్ కుమార్ ని వారి కార్యాలయం లో కలిసి మున్సిపల్ విద్యా విభాగాన్ని పటిష్ట పరచాలని కోరారు. మున్సిపల్ విద్యా వ్యవస్థ పర్యవేక్షణ కోసం మున్సిపల్ ఆక్ట్ లోనే గల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టు, నగరపాలక సంస్థలకు కేటాయించిన పదకొండు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేసి, భర్తీ చేయాలని కోరారు. పర్యవేక్షణ పేరుతో పురపాలక ఉపాధ్యాయులకు మరోసారి అన్యాయం చేయరాదని సూచించారు. స్థానిక సంస్థలయిన మండల పరిషత్, జిల్లా పరిషత్ లలో పనిచేస్తున్న ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.డి.ఓ. లుగా ఉన్నా, స్థానిక సంస్థలోని మున్సిపల్ విద్యా విభాగం లోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డి.డి.ఓ. అధికారులు ఇవ్వకపోవడం, అప్గ్రేడ్ చేసిన పాఠశాలలకు ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల పోస్టులను దశాబ్దాలుగా మంజూరు చేయకపోగా, వ్యవస్థ పర్యవేక్షణ బాధ్యతలను ఇంకో స్థానిక సంస్థలోని వారికి అప్పగించాలనే విధానం విచారకరం అని అన్నారు. మున్సిపల్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వేంటనే డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారాలు ఇవ్వాలని, అర్బన్ ప్రాంతాలకూ, రూరల్ ప్రాంతాలకు వ్యత్యాసం వున్నందున 3,4,5 తరగతుల విలీనానికి సంబంధించిన మున్సిపాలిటీలలో మినహాయింపు ఇవ్వాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల ఏర్పాటును సాధ్యమయినంత తొందరగా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వులు 125( రేషనలైజేషన్ మరియూ బదిలీలు) ని అమలు చేయాలని, సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రఫిఉద్దిన్, గౌరవాధ్యక్షులు ఇమాం భాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దగిరి శ్రీనివాస్, పి.రఘు, యం. రామ్ మోహన్, సిహెచ్. అమర్నాథ్, వి. సురేష్ కుమార్,జి. హరి ప్రసాద్, ఈ. యం. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button