krishna babuvisakhapatnam

భగవంతుని ఆశీస్సులతో అందరూ ఆరోగ్యవంతులుగా జీవించాలి

కె.కోటపాడు, (పల్లెవెలుగు) సెప్టెంబరు21: భగవంతుని ఆశీస్సులతో అందరూ ఆరోగ్యవంతులుగా జీవించాలని శ్రీ సత్యసాయి భజన మండళ్ల జోన్-3సమన్వయకర్త కశిరెడ్డి అప్పలనాయుడు అన్నారు. మండలంలోని కింతాడ శివారు కేవీపాలెంలో శ్రీ రామసత్యసాయి మందిరంలో మంగళవారం శ్రీ సత్య సాయి భజన మండలి, శ్రీరావాలమ్మ తాపీ మేస్త్రీల సంక్షేమ సంఘం సంయుక్త  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.శిబిరంను కన్నూరు సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ శిబిరంలో జోగన్నపాలెం, కూండ్రపువానిపాలెం, రామచంద్రపురం తదితర గ్రామాలకు చెందిన సుమారు 100మంది రోగులను గాయత్రి విద్యా పరిషత్ ఆసుపత్రి వివిధ విభాగాల  డాక్టరు కె.వి.సన్యాశి రావు, డాక్టరు జి.ఎస్.ఎల్. లక్ష్మీనారాయణ, డాక్టరు  కె.నరసింహమూర్తి, డాక్టరు డి.అనిత, డాక్టరు ఎ.నరసింహారావు డాక్టరు మనస్వి, డాక్టరు సృజన  పరీక్షించారు. వివిధ ఆపరేషన్లకు 25 మందినిగుర్తించి తరలించారు. ఫార్మసిస్ట్ శర్మ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.  హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ తాతాజీ, క్యాంపు ఆర్గనైజర్ ఇ.వి.ఎస్. కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో భజన మండళ్ల కన్వీనర్లు కన్నూరు అప్పలనాయుడు, బండారు నారాయణపాత్రుడు, సాయిభక్తులు  గజ్జి అప్పల నాయుడు కశిరెడ్డి విక్రమ్, సేవలందించారు. శ్రీ రావాలమ్మ తాపీ మేస్త్రిల సంక్షేమ సంఘం అధ్యక్షులు కన్నూరు సూర్యనారాయణ భోజన వసతి ఏర్పాటు చేశారు.

Back to top button