krishna babuvisakhapatnam

కోటపాడు లోఘనంగా వైయస్సార్ వర్ధంతి వేడుకలు

కే కోటపాడు (పల్లెవెలుగు) 2 సెప్టెంబర్: దివంగత ముఖ్యమంత్రి వర్యులు వై.యస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ఆదేశాల మేరకు జడ్పిటిసి అభ్యర్థిని బూడి అనురాధ ముఖ్య అతిథిగా విచ్చేశారు. గురువారం ఉదయం కోటపాడు మూడు రోడ్ల జంక్షన్ లో దివంగత ముఖ్యమంత్రి వర్యులు   వై.యస్ రాజశేఖర రెడ్డి  విగ్రహానికి పూలమాల వేసి నివాళుల్లు అర్పించారు, ఈ సందర్భంగా  మాట్లాడుతూ తెలుగు వారందరి హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహానేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. నమ్ముకున్న జనం కోసం ఎంత దూరమయిన పోరాడే తత్వంగల నాయకుడు వై.యస్  రాజశేఖర్ రెడ్డి అని సరిగ్గా అదే స్ఫూర్తితో ఆయన కుమారుడు వై.యస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అనంతరం స్థానిక 30 పడకల ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు , అందజేశారు, మండలంలో ఆయా గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ఎంపీటీసీ అభ్యర్థి రెడ్డి జగన్ మోహన్, వైఎస్సార్ సీపీ నాయకులు ఆవుగడ్డ శోoబాబు, శ్రీకాంత్, శీను, గ్రామ మాజీ ఉప సర్పంచ్ పైలా అమ్మజి , కిoతాడ సర్పంచ్ బండారు ఈశ్వరమ్మ ముత్యాల నాయుడు,  మండల వైస్సార్ సి.పి సర్పంచులు, ఎంపీటీసీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks