
krishna babuvisakhapatnam
జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రాంతీయ బ్యాంకుల సేవలు
కే కోటపాడు (పల్లెవెలుగు) 1 సెప్టెంబర్ : జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రాంతీయ బ్యాంకులు అందజేస్తున్న సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు కోరారు, కే కోటపాడు లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(dccb) ఆవరణలో బుధవారం ఏటీఎం కేంద్రాన్ని dccb సిబి విశాఖపట్నం చైర్ పర్సన్ చింతకాయల సన్యాసి పాత్రుడు తో కలిసి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ వ్యక్తిగత రుణాలు అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు, అనంతరం ఖాతాదారులకు రుణాలను అందజేశారు, ఈ కార్యక్రమంలోdccb విశాఖపట్నం సీఈఓ dvs.వర్మ. పిఏఎస్ చల్ల సత్యనారాయణ మూర్తి, డైరెక్టర్ జామి బుచ్చిరాజు , బ్రాంచ్ మేనేజర్ వెంకట అప్పారావు, బ్యాంకు సిబ్బంది, రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు