Abdul Javidvisakhapatnam

“రూట” గ్రేటర్ విశాఖ అధ్యక్ష ప్రధాన కార్యద్శులు గా వసీముర్ రహ్మాన్, ఖాలిద్ అన్సారీ

విశాఖపట్నం (పల్లెవెలుగు) 30 ఆగష్టు:  “రూట” గ్రేటర్ విశాఖ అర్బన్ శాఖ గౌరవ అధ్యక్షులుగా జివిఎంసి సీనియర్  ఉపాధ్యాయులు అన్వర్ అహ్మద్, అధ్యక్షలుగా ఎం టి పాలెం లోని గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ముహమ్మద్ వసీముర్ రహ్మాన్, ప్రధాన కార్యదర్శి గా కోట వీధి లోని గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఫోర్ట్ ఉర్దూ బాలుర పాఠశాల ఉపాధ్యాయలు ఎం డీ .ఖాలిద్ అన్సారీ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం జరిగిన ఎన్నిక కార్యక్రమం లో జిల్లా అధ్యక్షలు అబ్దుల్ రాజిఖ్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించగా , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రఖీబుర్ రాజీఖ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

నూతనంగా ఎన్నికైన శాఖాధిపతుల కు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ మునాఫ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు లయన్ ఇమామ్ బాష, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముజీబ్ షాహీ, రాష్ట్ర కార్యదర్శి ముహమ్మద్ హాషిమ్ , విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఖ్, కోశాధికారి ముజహిదుల్ హఖ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నికైన అన్వర్ అహ్మద్, ముహమ్మద్ వసీముర్ రహ్మాన్, ఎం డీ .ఖాలిద్ అన్సారీ లు మాట్లాడుతూ “రూట” సంఘ బలోపేతానికి , ఉర్దూ పాఠశాలల అభివృద్ది కి, ఉర్దూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Back to top button