vijayawadaAbdul Javid

సివిఆర్ లయన్స్ క్లబ్ కు అవార్డుల పంట

సివిఆర్ లయన్స్ క్లబ్ కు అవార్డుల పంట

అజిత్ సింగ్ నగర్ (విజయవాడ) 18 జూన్ : విజయవాడ సివిఆర్ లయన్స్ క్లబ్ కు జిల్లా స్థాయిలో మొత్తం ఆరు అవార్డులు లభించినట్లు క్లబ్ ప్రెసిడెంట్, ఎమ్.కే. బెగ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎమ్.ఎస్.ఇమామ్ బాషా తెలిపారు. ఈ రోజు జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ దేవినేని జోనీ కుమారి ఆధ్వర్యంలో జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ లో ఆన్లైన్ రిపోర్టింగ్ అవుట్ స్టాండింగ్ అవార్డు, సేవా మహోత్సవం అవుట్ స్టాండింగ్ అవార్డు లు  క్లబ్ కు, జిల్లా స్థాయిలో బెస్ట్ ప్రెసిడెంట్ ప్రశంసా అవార్డు ఎమ్.ఎస్.ఇమామ్ బాషా,   బెస్ట్ సెక్రెటరీ గా పి.మధు బాబు,బెస్ట్ ట్రెజరర్ గా ఎన్.శ్రీనివాస రావు,బెస్ట్ జోనల్ ఛైర్మన్ గా ఏ. శరాబంది రావు  అవార్డులు సాధించి నట్లు బాషా చెప్పారు. 2020 జులై లో కొత్తగా  స్థాపించిన  సి వి ఆర్ లయన్స్ క్లబ్ ఇన్ని అవార్డులు పొందడం పట్ల జిల్లా గవర్నర్ జోనీ కుమారీ  క్లబ్ ప్రెసిడెంట్ ఇమామ్ బాషా చేసిన అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు ఫలితం అని అభినందించారు. పలువురు జిల్లా లయన్స్ నాయకులు, టీచర్లు ఇమామ్ బాషా కు అభి నందనలు తెలిపారు.

Back to top button