vijayawadaAbdul Javid

రూట “రాష్ట్ర ఉర్దూ పాఠశాలల పరి రక్షణ సదస్సు”

రూట “రాష్ట్ర ఉర్దూ పాఠశాలల పరి రక్షణ సదస్సు”

విజయవాడ (ఆంధ్రప్రతిభ) 18 జూన్: విజయవాడ నగరం అరండల్ పేట లోని డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలామ్ నగరపాలక ఉర్దూ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో ఈ నెల 23 న “రాష్ట్ర ఉర్దూ పాఠశాలల పరి రక్షణ సదస్సు” నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ (రూట ఏపి) వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ హిదాయతుల్లా, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె. అబ్దుల్ వారిస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ సంయుక్త ప్రకటన లో తెలిపారు.

రాష్ట్ర సదస్సు చైర్మన్ గా రూట అసోసియేట్ అధ్యక్షులు లయన్ ఇమామ్ బాషా,  కన్వినర్ గా రూట ఉమ్మడి కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముష్తాఖ్ హుసేన్, పరిశీలకులుగా రాష్ట్ర సమన్వయకర్త ముహమ్మద్ అయ్యూబ్ లు వ్యవహరిస్తారని తెలిపారు.

ఉర్దూ మీడియం పాఠశాలలు స్థాపించి దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ది లో మాత్రం వెనకపడ్డాయని,  ఇప్పటికీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేని పాఠశాలలు సాక్షాత్తు విజయవాడ , విశాఖపట్నం, కడప , గుంటూరు,  చిత్తూరు లాంటి నగరాల్లో సైతం ఉన్నాయని ఇక మారుమూల ప్రాంతాల్లోనీ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కో చైర్మన్లు గా ఎన్టిఆర్ జిల్లా అద్యక్షులు ముహమ్మద్ గఫ్ఫార్ ఖాన్, గుంటూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ షజీర్, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ముహమ్మద్ రాజ, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రాజిఖ్,  పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముర్శలీన్, కో కన్వీనర్లు గా రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శులు మౌలానా న్యామతుల్లా (రాజమండ్రి) ,అబ్దుల్ ముజీబ్ షాహి (నరసరావు పేట), ఎస్ ఎం డి గయాస్ (గుంటూరు),అబ్దుల్ అలీం (కృష్ణ),అల్తాఫ్ హుసేన్ ఖాన్ (ప్రకాశం), జిలాన్ బాషా (నెల్లూరు) బాపట్ల జిల్లా అధ్యక్షులు రహ్మత్ అలి బేగ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమాముద్దిన్ ఖాద్రీ, విజయవాడ అర్బన్ రీజియన్ అధ్యక్షలు ఇక్బాల్ పాష లు వ్యవహరిస్తారని తెలిపారు.

ఉర్దూ మీడియం విద్యా వ్యవస్థ ను పటిష్ట పరిచి సమస్యలు ప్రభుత్వ దృష్టి కు తీసుకెళ్లేందుకు ప్రజా ప్రతినిధులకు, రాష్ట్ర విద్యా శాఖ అధికారులకు సదస్సు కు ఆహ్వానిస్తున్నామని రాష్ట్రం లోని ఉర్దూ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Back to top button
Enable Notifications    OK No thanks