vijayawada

శ్రీ చండ్ర రాజేశ్వరరావు స్మారక గ్రంధాలయం లో క్లబ్ జనరల్ బాడీ సమావేశం

శ్రీ చండ్ర రాజేశ్వరరావు స్మారక గ్రంధాలయం లో క్లబ్ జనరల్ బాడీ సమావేశం

విజయవాడ (ఆంధ్రప్రతిభ) 30 మే: కృష్ణా జిల్లాలో సి.వి.ఆర్., లయన్స్ క్లబ్ కు సేవా కార్యక్రమాలలో మంచి పేరు ఉన్నదని, భవిష్యత్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని లయన్స్ క్లబ్ జోనల్ ఛైర్మన్ అన్నాబత్తుల శరాబంది రావు అన్నారు. ఈ రోజు, ప్రజాశక్తి నగర్, శిఖామణి సెంటర్ లోని శ్రీ చండ్ర రాజేశ్వరరావు స్మారక గ్రంధాలయం లో క్లబ్ జనరల్ బాడీ సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ ఎమ్.ఎస్.ఇమామ్ బాషా అధ్యక్షత వహిస్తూ లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ దేవినేని జోనీ కుమారీ నేతృత్వంలో, సూచనలు, సలహాలతో, క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు నిర్వహించామని,రీజనల్ స్థాయిలో క్లబ్ మూడవ స్థానం లో ఉన్నదని చెప్పారు.క్లబ్ సెక్రెటరీ పి.మధు బాబు జూలై నుండి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల నివేదికను సమర్పించారు.అసిస్టెంట్ ట్రెజరర్ ఎన్.శ్రీనివాస రావు క్లబ్  యొక్క ఆర్ధిక రిపోర్టు ను సమర్పించారు.కొత్తగా క్లబ్ లో ప్రవేశిస్తున్న వారిని జోనల్ ఛైర్మన్ శరాబంది రావు పరిచయం చేసి వారిని అభినందించారు.జూన్ 30 వరకు ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వైస్ ప్రెసిడెంట్ జి.వెంకటేష్ చేసిన ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.ఇంకా ఈ సమావేశం లో క్లబ్ డైరెక్టర్లు నైనవరపు శ్రీనివాస రావు,పింగళి వెంకట రమణ,జి.నాగ రాజు,ఎమ్.వీర భద్ర రావు,పి.వి. హనుమంత రావు,కే.ఎస్.ప్రసాద్,డి.ప్రకాష్ హాజరై ప్రసంగించారు.జూన్ 16 న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించి నట్లు ప్రెసిడెంట్ ఇమామ్ బాషా చెప్పారు.

Back to top button