vijayawada

సివిఆర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

సివిఆర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

భవానీపురం,విజయవాడ: ఎవ్వరూ లేని అనాథ పిల్లలను ఆదుకుంటే,వారికి పట్టెడు అన్నం పెడితే దేవుడు మన పిల్లలకు, మన కుటుంబానికి మంచి చేస్తాడని జిల్లా లయన్స్ క్లబ్ జోనల్ ఛైర్మన్ ఏ. శరాబంది రావు అన్నారు. శనివారం నాడు భవానీ పురం, కృష్ణా నది ఒడ్డున గల ఎస్.కే.సి.వి., అనాథ పిల్లల వసతి గృహం నందు సివిఆర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై,అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ ఎమ్.ఎస్.ఇమామ్ బాషా అధ్యక్షత వహిస్తూ, నగరంలోని వివిధ ప్రాంతాల లోని అనాథ ఆశ్రమాలలో ప్రతీ నెలా అన్నదాన కార్యక్రమాన్ని క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్లబ్ సెక్రెటరీ పి.మధు బాబు మాట్లాడుతూ క్లబ్ ద్వారా ఎక్కువగా ఉచిత అన్న దాన కార్యక్రమాలు నిర్వహించి నట్లు తెలిపారు.క్లబ్ మార్కెటింగ్ ఛైర్మన్ ఎన్.వి.ఎస్.కృష్ణా రావు 2022 లో ఎక్కవ మంది సభ్యులను క్లబ్ లో చేర్పించి, వారికి సేవా కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడానికి కృషి చేయాలని నిర్ణయించి నట్లు చెప్పారు. సుమారు 60 మంది అనాథలకు అన్నదానం చేసినట్లు ఎల్.సి.ఎఫ్. కో- ఆర్డినేటర్ టి.వెంకట నారాయణ చెప్పారు.ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్లు ఎమ్. రవి ఆంజనేయులు, జి.త్రినాథ్, ఎన్.వి.జి.సుదర్శన్, సిబ్బంది, పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks