vijayawada

ఎమ్.కే. బేగ్  మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్, ఉర్దూ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ

ఎమ్.కే. బేగ్  మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్, ఉర్దూ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ

అజిత్ సింగ్ నగర్ (పల్లెవెలుగు) 27 ఏప్రిల్: కృష్ణా జిల్లా ఉర్దూ రేంజ్ ఉప విద్యాధికారి అబ్దుల్ మునాఫ్ మంగళ వారం ఉదయం 59 వ డివిజన్, అజిత్ సింగ్ నగర్ లోని ఎమ్.కే. బేగ్  మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్, ఉర్దూ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 1 నుండి 5 వ తరగతి విద్యార్థుల యొక్క విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. అన్నీ సక్రమంగా ఉన్నట్లు, పాఠశాల ప్రాంగణం శుభ్రంగా, ఆహ్లాద కరమైన వాతావరణాన్ని కలిగి ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం మొత్తం 40 మంది విద్యార్థులు ఉర్దూ విభాగంలో ఉన్నారని, ఒక టీచర్, ఒక విద్యా వాలంటీర్ పనిచేస్తున్నారని, భవిష్యత్తు లో ఉర్దూ స్కూల్ గా రూపొందే అవకాశం ఉందని మునాఫ్ తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్.ఎస్.ఇమామ్ బాషా, టీచర్లు అబ్దుల్ మునాఫ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ విభాగపు టీచర్ పి.హమీదున్నిసా, విద్యా వాలంటీర్ రజియా సుల్తానా, స్టాఫ్ కార్యదర్శి డి.పూర్ణ చంద్ర రావు, ఇతర టీచర్లు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks