Abdul Javidvijayawada

సివిఆర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

విజయవాడ (పల్లెవెలుగు) 03 అక్టోబర్: అజిత్ సింగ్ నగర్ అంతర్జాతీయ లయన్స్ క్లబ్ యొక్క రెండవ ముఖ్య లక్ష్యం నిరాశ్రయులకు, వృద్ధులకు, పేదలకు అన్నదానం చేయడం అని, దానికనుగుణంగా వృద్ధాశ్రమం లోని వారికి సివిఆర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించినట్లు క్లబ్ ప్రెసిడెంట్ ఎమ్.ఎస్.ఇమామ్ బాషా అన్నారు. అజిత్ సింగ్ నగర్,ఆంధ్ర ప్రభ కాలనీ మూడవ రోడ్డు లో గల సూర్య కాంతి వృద్ధాశ్రమం నందు గల వృద్ధులకు ఆదివారం మధ్యాహ్నం  అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ.కే.టి.పి. మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో పనిచేసే సీనియర్ టీచర్ సయ్యద్ యూసఫ్ సలీం మాట్లాడుతూ నేడు సమాజంలో డబ్బుకు ప్రజలు విలువ ఇస్తున్నారని, తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుండా ఇంటి నుండి బయటకు గెంటుతున్నారని, లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థల వల్లనే వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయని చెప్పారు. క్లబ్ సెక్రెటరీ పి.మధు బాబు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో జూలై నుండి ఇప్పటి వరకు పది సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. సుమారు 40 మందికి ఈ రోజు క్లబ్ తరపున అన్నదానం చేసినట్లు చెప్పారు. క్లబ్ జాయింట్ ట్రెజరర్ ఎన్.శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రతి నెలా క్లబ్ ఆధ్వర్యంలో మూడు సేవా కార్యక్రమాలు చేయడానికి క్లబ్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎల్.సి.ఈ.ఎఫ్., కో – ఆర్డినేటర్ టి.వెంకట నారాయణ, క్లబ్ డైరెక్టర్స్ జి.నాగరాజు, పి.వెంకట రమణ,సభ్యులు పాల్గొన్నారు.

Back to top button