Abdul Javidvijayawada

పెండింగులో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్  విడుదల చేయాలని సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ కు వినతి పత్రం

విజయవాడ (పల్లెవెలుగు) 09 సెప్టెంబర్: స్థానిక విజయవాడలో తాడేపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ జి.వి.రఘు రామ్ కి  వినతి పత్రం అందజేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి.రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్.రియాజ్ బనగానపల్లె అధ్యక్షుడు రామకృష్ణు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక అనేక మంది విద్యార్థులు కళాశాలలోనే వారి సర్టిఫికెట్లు ఉన్నాయని, విద్యార్థులు కళాశాల యాజమాన్యలకు సర్టిఫికెట్లు ఇవ్వాలని అడుగుతుంటే కళాశాల యాజమాన్యాలు మీకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాలేదు కనుక కళాశాల ఫీజు మీరే చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాలని కళాశాల యాజమాన్యం అంటున్నారని, అనేక మంది విద్యార్థులు వారి సర్టిఫికెట్లు తీసుకోక ఉద్యోగాలకు దూరం అవుతున్నారని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు విడుదల చేస్తున్న మెస్ చార్జీలు విద్యార్థులకు సరిపోవడం లేదని, హాస్టల్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. స్పందించిన సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ జి.వి.రఘురామ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాని విద్యార్థుల సమస్య తమ దృష్టికి వచ్చిందని,వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సురేష్ తదితరులు పాల్గొన్నారు

Back to top button