Abdul Javidvijayawada

రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలు సకాలంలో అందేందుకు తమ వంతుగా కృషి చేసి వారి అభివృద్ధికి సహకరిస్తా – రాష్ట్ర మైనార్టి ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ షేక్. అసిఫ్

విజయవాడ (పల్లెవెలుగు) 3 సెప్టెంబర్: రాష్ట్రంలోను మైనార్టిలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలు సకాలంలో అందేందుకు తమ వంతుగా కృషి చేసి వారి అభివృద్ధికి సహకరిస్తానని రాష్ట్ర మైనార్టి ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ జనాబ్ షేక్. అసిఫ్ తెలిపారు. స్థానిక యన్.టి.ఆర్. సర్కిల్, పటమటలోని మైనార్టి ఫైనాన్స్ కార్పోరేషన్ కార్యలయానికి రాష్ట్ర మైనార్టి ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తొలిసారి శుక్రవారం విచ్చేసారు. మైనార్టిస్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో పథకాల గురించి సమీక్షించారు. తదనంతరం సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనార్టిల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  తనదైన శైలిలో పధకాలను ప్రవేశపెట్టడం జరిగినదని తెలిపినారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో ముస్లిం మైనార్జిలకు ఒక డిప్యూటీ సి.యం.ను కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి మాత్రమే దక్కుతుందని అన్నారు. మైనార్జి ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ బాద్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సారిగా కృష్ణాజిల్లాలోని కార్యాలయాన్ని సందర్శించినారు. కార్యక్రమములో మైనార్జి ఫైనాన్స్ కార్పోరేషన్, క్రిస్టియన్ మైనార్టి ఫైనాన్స్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఓ. హేమచంద్ర కార్యలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Back to top button