Abdul Javidvijayawada

“రూట” లెక్చరర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా హాఫిజ్ షేక్ అహ్మద్

హర్షం వ్యక్తం చేసిన కృష్ణ వాసులు

విజయవాడ (పల్లెవెలుగు) 02 సెప్టెంబర్:  రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్, లెక్చరర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా విజయవాడ లోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  హాఫిజ్ షేక్ అహ్మద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హాఫిజ్ షేక్ అహ్మద్ కృష్ణ జిల్లాలో ఉర్దూ  ఉన్నత చదువుల కొరకు విజయవాడ, నూజివీడు, పెడన, పామర్రు తదితర ప్రాంతాలలో కళాశాలల లో ఉర్దూ భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు అందించిందని రూట రాష్ట్ర నాయకత్వం తెలిపింది. ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రిన్సిపాల్ గా సేవలు అందిస్తున్నారని, రాష్ట్రంలోని పాఠశాలలు మరియు కళాశాలలు స్థితిగతులపై   మంచి పట్టు ఉందని , ఆయన సేవలకు, ప్రతిభకు గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు గా ఎన్నుకున్నామని  “రూట ఎపి” రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అబ్దుల్ వారిస్, సయ్యద్ ఇక్బాల్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అబ్దుల్ మునాఫ్ లు పేర్కొన్నారు. నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ అహ్మద్ మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్య లో ఉర్దూ మీడియం పరిస్థితి చూస్తే చాలా బాధ కలుగుతుందని  90 శాతం వరకు కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీలతో కళాశాలలు నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో ఉర్దూ మీడియం అధ్యాపక పోస్టులు చేర్చి భర్తీ చేయాలని  కోరారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రూట రాష్ట్ర శాఖ కు కృతజ్ఞతలు తెలుపుతూ కళాశాల విశ్వవిద్యాలయలలో ప్రపంచ భాష అయిన ఉర్దూకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు.  రాష్ట్ర అధ్యక్షుడు గా ఎన్నికైన హఫీజ్ షేక్ అహ్మద్ కు “రూట” రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు లయన్ ఇమామ్ బాషా, రాష్ట్ర కన్వీనర్ ముహమ్మద్ రఫీ, కృష్ణ జిల్లా “రూట” అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముహమ్మద్ గఫార్ ఖాన్ ,సయ్యద్ మూష్తాక్ హుస్సేన్, ఆర్థిక కార్యదర్శి సయ్యద్ హఫీజ్ , జిల్లా ఉర్దూ అధ్యాపకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Back to top button
Enable Notifications    OK No thanks