Abdul Javidvijayawada

ఇమామ్ బాషా,ముంతాజ్ సుల్తానా ఉర్దూ స్కూళ్లకు చేసిన సేవలు భేష్

విజయవాడ (పల్లెవెలుగు) 29 ఆగష్టు : ఎమ్.ఎస్.ఇమామ్ బాషా 27 సంవత్సరాలు ఉర్దూ టీచర్ గా, ప్రధానోపాధ్యాయులుగా,ముంతాజ్ సుల్తానా ఫారూఖ్ నగర్ ఉర్దూ యు.పి.,స్కూల్ అభివృద్ధికి అవిరళ కృషి చేశారని అరండల్ పేట ఉర్దూ స్కూల్ కాంప్లెక్స్ సెక్రెటరీ నసీమా పర్వీన్ అన్నారు.బాషా,సుల్తానా పదోన్నతుల ద్వారా ఎల్.ఎఫ్.ఎల్.,హెచ్.ఎమ్.గా., ఎమ్. కె. బేగ్ స్కూల్ కు, బి. ఈడి.అసిస్టెంట్ గా మౌలానా ఆజాద్ ఉర్దూ హైస్కూల్ లో ప్రమోషన్లపై చేరిన సందర్భంగా అరండల్ పేట మునిసిపల్ ఉర్దూ హైస్కూల్ కాంప్లెక్స్ టీచర్లు వారిరువురినీ ఘనంగా సన్మానించారు.పూర్ణానంద పేట ఉర్దూ స్కూల్ హెచ్.ఎమ్.,రజియా సుల్తానా ఇమామ్ బాషా ఉర్దూ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించి ఫౌండర్ సెక్రటరీగా,ప్రింట్ అండ్ మీడియా సెక్రెటరీ గా ఉర్దూ విద్యార్థుల సంక్షేమానికి విశేష కృషి సల్పారని,ముంతాజ్ ఎలిమెంటరీ స్కూల్ ను,యు.పి.,స్కూల్ గా అప్గ్రేడ్ చేయుటకు పాటుపడ్డారని చెప్పారు.తెలుగు టీచర్ ఎమ్.డి.హుస్సేన్ ఇమామ్ బాషా స్కూల్ లో రికార్డులు పొందికగా,శుభ్రంగా,కరెక్టుగా ఉంచి అనేక మందికి ఆదర్శంగా నిలిచారనీ,జిల్లా స్థాయిలో,రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లు పొందారని చెప్పారు.అనంతరం టీచర్లు వారిని దుస్యాలువలతో సన్మానించారు.

Back to top button
Enable Notifications    OK No thanks