Abdul Javidvijayawada

నూతన కార్యవర్గం ఎన్నిక

విజయవాడ (పల్లెవెలుగు) 17 ఆగష్టు: “విజయవాడ సివిఆర్ లయన్స్ క్లబ్” ప్రెసిడెంట్ లయన్ ఎమ్.ఎస్.ఇమామ్ బాషా, మిగతా ఆఫేస్ బెరర్స్, డైరెక్టర్స్, నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్ణానంద పేట, ఏలూరు లాకుల దగ్గర గల “గోల్డెన్ వే” హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ షేక్ అబ్దుల్ రషీద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాస్ట్ గవర్నర్ లయన్ మిరియాల వెంకటేశ్వర రావు విచ్చేసి ఒక స్కూల్ లో చదివిన వారు కలిసి స్కూల్ పేరు మీద లయన్స్ క్లబ్ స్థాపించడం ఇప్పటి వరకు లేదని, ఈ క్లబ్ ను ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కొత్త క్లబ్లను స్థాపించాలని కోరారు. జిల్లా మొదటి వైస్ – గవర్నర్ లయన్ దామర్ల  శ్రీశాంతి కొత్త కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ ఈ సంవత్సరమంతా మంచి సేవా కార్యక్రమాలు చేసి జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలని ఆమె అన్నారు. జిల్లా రెండవ వైస్ – గవర్నర్ లయన్ జె.శంకర గుప్తా గారు క్లబ్ యొక్క నియమ నిభందనలు, ప్రెసిడెంట్, సెక్రెటరీ, ట్రెజరర్ యొక్క పనులు, బాధ్యతల గురించి వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కేబినెట్ సెక్రెటరీ లయన్ వై.గాంధీ, కేబినెట్ ట్రెజరర్ లయన్ కె.వి.రామారావు, రీజనల్ ఛైర్మన్ లయన్ వై.శ్రీనివాస రావు, జోనల్ ఛైర్మన్ లయన్ ఏ. శరాబందిరావు పాల్గొని ప్రసంగించారు. క్లబ్ సెక్రెటరీ లయన్ పి.మధు బాబు, జాయింట్ ట్రెజరర్ లయన్ ఎన్.శ్రీనివాస రావు, బావాజీ పేట డివిజన్ కార్పొరేటర్ కోయిల గుంట మల్లీశ్వరి, క్లబ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కొత్తగా  ప్రెసిడెంట్ గా ఎన్నికైన హెచ్.,ఎమ్.,లయన్ ఎమ్.ఎస్.ఇమామ్ బాషా దంపతులను హాజరైన ముఖ్య అతిథులు, సివిఆర్ లయన్స్ క్లబ్ సభ్యులు, ఘనంగా సన్మానించారు

Back to top button
Enable Notifications    OK No thanks